తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు 'సిపిఐ' అభయం
నల్లబెల్లి, నవంబర్ 4 ( విజయ క్రాంతి): ఇటీవల తండ్రి శేఖర్ అనారోగ్యంతో మృతి చెందడంతో పెద్ద దిక్కును కోల్పోయిన నల్లబెల్లి మండల కేంద్రానికి(Nallabelli Mandal Center) చెందిన శ్రావణి, అంకిత అనే ఇద్దరు అమ్మాయిలను బుధవారం సిపిఐ నాయకులు(CPI leaders) పరామర్శించారు.గతంలోనే తల్లితో పాటు తాత, నాయనమ్మలు కూడా చనిపోవడంతో ప్రస్తుతం తాము అనాథలుగా మారామని, చదువులకు, నిత్య అవసరాలకు అండగా నిలవాలని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు(CPI District Council Members) చింతకింది కుమారస్వామి స్పందిస్తూ బాధిత కుటుంబానికి సిపిఐ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తల్లి పేరిట ఉన్న వ్యవసాయ భూమిని అమ్మాయిల పేరిట మార్చడం, ఆస్తుల పంపకాల్లో న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్(CPI District Assistant Secretary Panasa Prasad), బీసీ హక్కుల సాధన సమితి నాయకులు చీకటి ప్రకాష్, మండల కార్యదర్శి పరికి కోర్నేలు, రైతు సంఘం నాయకులు మామిండ్ల పెద్ద ఐలయ్య, కడియాల క్రాంతి కుమార్, మాజీ ఎంపీటీసీ జన్ను జయరాజు తదితరులు పాల్గొన్నారు.