గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి..
బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలి..
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు ఆనంద్ పిలుపు..
ఆలేరు, నవంబర్ 4 (విజయక్రాంతి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు ఆనంద్(BJYM District Vice President Perapu Anand) కోరారు. బుధవారం ఆలేరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం, ఓటు ప్రాధాన్యతపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పేరపు ఆనంద్ మాట్లాడుతూ.. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులు గురువారం (నవంబర్ 5) ఆలేరు రైల్వే గేట్ సమీపంలోని మల్లన్న మిల్క్ పార్లర్లో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు, ఇతర వివరాల కోసం పేరపు ఆనంద్‌ను 8688273143 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుగూరి శాంతిరెడ్డి, శంకర్, మంత్రి సాయి, ఎలగల వెంకటేష్, వడ్డెమాన్ నరేందర్, కామిటికారి కృష్ణ, కళ్లెం రాజు తదితరులు పాల్గొన్నారు.