జన సురక్ష పథకాలపై అవగాహన కార్యక్రమం

04-11-2026 | 06:20pm

అర్హులందరూ ప్రభుత్వ బీమా, పెన్షన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

బ్యాంకు మేనేజర్ యాదగిరి..

కోనరావుపేట, నవంబర్ 4 (విజయక్రాంతి): ఆర్థిక సమ్మిళిత సాధికారతలో భాగంగా జన సురక్ష పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు కోనరావుపేట గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు మేనేజర్ యాదగిరి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY), అటల్ పెన్షన్ యోజన(APY) పథకాలతో పాటు కేవైసీ, రీ-కేవైసీ, ఆధార్ సీడింగ్, నామినీ నమోదు తదితర బ్యాంకింగ్ సేవలపై గ్రామ ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి, ఇప్పటివరకు ఈ పథకాలలో చేరని అర్హులైన వారికి అక్కడికక్కడే నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు బీమా, పెన్షన్ పథకాలలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు మేనేజర్ యాదగిరి, బ్యాంకు సిబ్బంది, యూనియన్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ) ఆదర్శ్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు అభిషేక్, వంశీ, శ్రీకాంత్, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు