దీపావళి దీపాలు కొండెక్కకుండా ఉండాలంటే.. ఈ చిట్కా ట్రై చేయండి!

30-10-2026 | 05:23pm

దీపావళి వేళ ఒత్తుల విషయంలో ఓ సులభమైన చిట్కా.. నెయిల్ పాలిష్‌తో ఇలా ప్రయత్నించండి! దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఇంటి నిండా దీపాలు వెలిగించి అందంగా అలంకరించుకోవడం మహిళలకు ఎంతో ఇష్టం. ఇంటి ముందు, గుమ్మం దగ్గర, పూజ గదిలో దీపాలు వెలిగించి పండుగ శోభను మరింత పెంచుతారు. అయితే కొన్నిసార్లు దీపాలు వెలిగించిన కొద్దిసేపటికే ఒత్తులు ఆరిపోతుంటాయి. దీంతో మళ్లీ మళ్లీ దీపాలు వెలిగించాల్సి వస్తుంది.

ఈ సమస్యకు ఓ చిన్న చిట్కా ఉందంటూ ఓ పద్ధతి ప్రచారంలో ఉంది. ముందుగా దీపాల ఒత్తులకు మనం గోళ్లకు ఉపయోగించే నెయిల్ పాలిష్ (Nail Polish) రాయాలి..ఆ తర్వాత వాటిని నూనెలో వేసి వెలిగిస్తే దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి.


మరిన్ని వార్తలు