సీవోపీడీపై అవగాహన కార్యక్రమం
నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్
హైటెక్ సిటీలో ప్రత్యేక ఊపిరితిత్తుల స్క్రీనింగ్ ప్యాకేజీ ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, శ్వాస సంబంధిత సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స అందించాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) హైటెక్ సిటీ యూనిట్లో ప్రపంచ సీవోపీడీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సీవోపీడీ వ్యాధి లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న ఆధునిక నిర్ధారణ, చికిత్సా విధానాలపై వైద్యులు అవగాహన కల్పించారు.
ప్రజలకు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక లంగ్ స్క్రీనింగ్ ప్యాకేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు డా. ఏఆర్ రఘుకాంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మాట్లాడుతూ రెండు మూడు వారాలకు మించి దగ్గు, ఆయాసం కొనసాగితే పల్మనాలజిస్ట్ను సంప్రదించి స్పురైమెట్రీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు నిర్ధారణతో వ్యాధి తీవ్రతను నియంత్రించడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు. డా. మేఘనా సుభాష్ మాట్లాడుతూ ముందస్తు నిర్ధారణ, సరైన చికిత్స, క్రమబద్ధమైన వైద్య పర్యవేక్షణతో సీవోపీడీ ఉన్నవారు కూడా మెరుగైన జీవన ప్రమాణాలను కొనసాగించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.