విజయవంతంగా 20 రోబోటిక్ కిడ్నీ సర్జరీలు

19-11-2026 | 05:05am

సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీలో నిర్వహణ

హైదరాబాద్, 18 నవంబర్ (విజయక్రాంతి): తూర్పు హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్న ఎల్బీ నగర్లోని ‘సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ(Sun Institute of Urology)’ కీలక మైలురాయిని చేరుకుంది. అత్యాధునిక ‘మెరిల్’ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా 20 కిడ్నీ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ సీనియర్ యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వడ్డి సూర్యప్రకాష్ మాట్లాడుతూ 20 రోబోటిక్ కిడ్నీ సర్జరీల మైలురాయిని చేరుకోవడం మా బృందం నిబద్ధతకు, మెరిల్ రోబోటిక్ టెక్నాలజీ కచ్చితత్వానికి నిదర్శనం అన్నారు.ఆధునిక సాంకేతికత సహాయంతో ప్రతి పేషెంట్ త్వరగా కోలుకునేలా నాణ్యమైన వైద్యం అందించడమే మా ప్రధాన లక్ష్యమన్నారు.

మరిన్ని వార్తలు