ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహన
యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘ది వెల్బీయింగ్ రౌండ్‌టేబుల్ యాడింగ్ లైఫ్ టు ఇయర్స్’ కార్యక్రమం నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు, మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యక్తిగత ఆరోగ్యం, ఉద్యోగుల సంపూర్ణ శ్రేయస్సుపై అవగాహన కల్పించే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్(Yashoda Hospitals) హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ‘ది వెల్బీయింగ్ రౌండ్‌టేబుల్ యాడింగ్ లైఫ్ టు ఇయర్స్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య, కార్పొరేట్, క్రీడా, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఆధునిక జీవనశైలిలో సంపూర్ణ ఆరోగ్యం ప్రాధాన్యతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత విజయ్ దేవరకొండ, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి. పటేల్ (దాజీ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒలింపిక్ పతక విజేత, ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత పీవీ సింధు ప్రత్యేక ప్యానెల్ సభ్యురాలిగా పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్ చైర్మన్ జీ రవీందర్ రావు స్వాగతోపన్యాసం చేయగా,యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అభినవ్ గురుకంటి మాట్లాడారు.