భువనగిరిలో ఘనంగా దసరా వేడుకలు
21-10-2026 | 04:37pm
రావణాసురుడి దహనం.. జమ్మిచెట్టు వద్ద సందడి
ఆలేరు, అక్టోబర్ 21 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) భువనగిరి పట్టణంలోని 14వ వార్డు హుస్నాబాద్‌లో దసరా పండుగను(Dasara Festival) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం(Burning of Ravanasura's effigy) చేసి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుకున్నారు. అనంతరం జమ్మిచెట్టు(Jammi tree) వద్ద స్థానికులు సందడి చేస్తూ ఒకరికొకరు జమ్మి ఆకులు(Jammi leaves) ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ వేడుకలతో భువనగిరి లో సందడిగా వాతావరణం నెలకొంది.