సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం..

29-09-2026 | 06:00pm

చెన్నూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం 8వ వార్డుకు చెందిన తుమ్మ క్రాంతికి ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్)ద్వారా మంజూరైన ₹120000 ఆర్థిక సహాయాన్ని మంగళవారం చెన్నూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సాధనబోయిన కృష్ణ అందజేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై హైదరాబాద్‌లో చికిత్స పొందాడు. వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో కుటుంబ సభ్యులకు  ఖర్చు కాగా  కో ఆప్షన్ సభ్యుడు సాధనబోయిన  కృష్ణకు చెప్పుకున్నారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Dr. Gaddam Vivek Venkatswamy) దృష్టికి కృష్ణ తీసుకెళ్లారు. దీంతో మంత్రి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ₹1,20,000 ఆర్థిక సహాయం మంజూరు చేయించారని  కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మ క్రాంతి  కుటుంబ సభ్యులు మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఆదుకునన్న మంత్రికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ శిరీష సంతోష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు