ప్రాథమిక పాఠశాలకు బీరువా బహుకరణ, విద్యార్థులకు పెన్ను పెన్సిల్ బుక్కులు పంపిణీ

29-09-2026 | 05:59pm

మాగనూరు, సెప్టెంబర్ 29: మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు(Government Primary School)  మక్తల్ వాసవి క్లబ్, జిల్లా వాసవి క్లబ్ 108 గవర్నర్ గోల్డెన్ స్టార్ టి సి జి ఎఫ్ కల్మచర్ల రమేష్ గారి ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలకు బీరువా బహుకరించారు. అదేవిధంగా విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్స్, రబ్బరు,పంపిణీ చేశారు.

అంతకుముందు వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా కల్మచర్ల రమేష్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలలకు పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులను, మంచినీటి ట్యాంకులను, ఫిల్టర్ వాటర్ ట్యాంకులను, తదితర వాటిని ఇస్తుంటుంటామన్నారు.

పాఠశాల ఆవరణ లో మొక్కలు నాటారు ప్రతి మొక్క తల్లి పేరు పైన నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, మాజీ డిప్యూటీ గవర్నర్ కల్వల శ్రీనివాస్, కార్యదర్శి కొత్త ఆంజనేయులు,

మాగనూరు మండల వ్యవసాయ సంఘ అధ్యక్షులు డాక్టర్ జి సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు నరసింహుల శెట్టి, కార్యదర్శి వీరన్న, కోశాధికారి గిరిధర్, మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు రామ్ గోపాల్ శెట్టి, రవికుమార్ ,జగదీష్ ,నరేందర్ ,ప్రతి కృష్ణయ్య, సూర్యనారాయణ, బద్రీనాథ్ ,నాగేందర్, మంజునాథ్ ,వరదరాజులు ,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు