ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
- వైభవంగా స్వామివారి నిత్య పూజలు....
- స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య...
యాదగిరిగుట్ట, అక్టోబర్ 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో(Sri Lakshmi Narasimha Swamy Temple) శాస్త్రోక్తంగా నిత్య పూజలను పండితులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు.
అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు.... స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు.... శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రభుత్వం బీర్ల ఐలయ్య దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సాంప్రదాయ ప్రకారంగా స్వాగతం పలికిన అర్చకులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.