పటాకుల విక్రయాలకు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి

06-11-2026 | 05:44pm

చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే బాణాసంచను కాల్చాలి

మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్

యాదగిరిగుట్ట, నవంబర్ 6 (విజయక్రాంతి): దీపావళి పండుగ బాణసంచా(Diwali festival fireworks) (టపాసులు) కాల్చడం అనేది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి, ఆనందానికి ప్రతీక అని దీపావళి పండుగ(Diwali festival) రోజున ప్రజలు పటాకులు కాల్చడం ఆనవాయితీగా వస్తుందని అయితే పర్యావరణ పరిరక్షణకు దృష్టిలో ఉంచుకొని ప్రజలు గ్రీన్ కాకర్స్(Green Cockers)ను కాల్చాలని మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్(Municipal Commissioner D. Srinivas) అన్నాడు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సి పాలిటీ పరిధిలో బాణాసంచా విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ పొందాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. గతంలో మాదిరిగా  యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హై స్కూల్ గ్రౌండ్ లో బాణాసంచ స్టాల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని విక్రయదారులకు   సూచించారు. అనుమతి లేకుండా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు

చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. పటాకుల దుకాణాల వద్ద తప్పనిసరిగా నీటి బకెట్లు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రద్దీ ప్రాంతాలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అలాగే ప్రజలు పటాకు లను బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చాలని, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే బాణా సంచా కాల్చేలా చూడాలని కోరారు.  నైలాన్, సిల్క్ దుస్తులకు బదులుగా కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు.  శబ్ద కాలుష్యము పొగ ఎక్కువగా వచ్చే పటాకులను కాల్చవద్దని గ్రీన్ కాకర్స్ ను ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రజలు, వ్యాపారులు భద్రతా నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కమిషనర్ కోరారు.

మరిన్ని వార్తలు