నాగోబా సన్నిధిలో రేలా రేలా.. దండారి సంబరాలు
ఉట్నూర్, నవంబర్ 10( విజయక్రాంతి ): దీపావళి పండుగ(Festival of Diwali) సందర్భంగా ఆదివాసీ గిరిజనులు(Adivasi tribal people) ఘనంగా జరుపుకునే దండారి ఉత్సవాలను(Dandari festivals) సందర్భంగా నాగోబా సన్నిధిలో ఆదివాసి మహిళలు రేలా రేలా నృత్యాలు(Tribal women performing Rela Rela dances) చేయడంతో పాటు దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం సిరికొండ మండలంలోని రాయి గూడ గ్రామానికి చెందిన గిరిజనులు దండారిగా వచ్చి నాగోబా దేవుడి మొక్కలు తీర్చుకోవడంతోపాటు ఆటపాటలతో రోజంతా కాలక్షేపం చేశారు.
దండారి ఉత్సవాల ముగింపు ప్రారంభం
దీపావళి పండుగ సందర్భంగా గిరిజన గ్రామాల్లో దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. పండగ ముగింపు తర్వాత గిరిజన గ్రామాలలో దండారి ఉత్సవాలకు ముగింపు ప్రారంభించారు. దండారి ఉత్సవాలు నిర్వహించిన గ్రామాల్లో కొలబోడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముగింపు పలికారు.