అల్ఫోర్స్ నాస్టాల్జియా వేడుకలు
ముకరంపుర, నవంబరు 10 (విజయక్రాంతి): నగరంలోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ ప్రైమరీ ఎస్6 క్యాంపస్ లో ‘నాస్టాల్జియా’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి(Dr. V. Narender Reddy) ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజల నిత్యజీవితంలో భాగమైన వస్తువులు, రవాణా సాధనాలు, సమాచార వ్యవస్థలు, వినోద పరికరాలు, ఆహారపు అలవాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు.
పాతకాలపు వస్తువులు, జీవన విధానాలు, రవాణా సాధనాలు, సమాచార వ్యవస్థలు, సంగీతం, ఆహార సంస్కృతి, నృత్యాలు, ఫ్యాషన్ల సమ్మేళనంగా సాగిన ఈ ‘నాస్టాల్జియా’ వేడుక ఆనాటి మధుర జ్ఞాపకాలను మరోసారి సజీవం చేస్తూ అందరికీ మరపురాని అనుభూతిని అందించిందని పాఠశాల బృందాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.