అక్రమ స్థలాలు చదును

10-11-2026 | 08:54pm

కోహెడ, నవంబర్ 10 (విజయక్రాంతి): కోహెడ నూతన బస్టాండ్(Koheda Bus Stand) ఆవరణలోని సర్వే నం 1229 ప్రభుత్వ భూమిని అక్రమించారాని.. మంగళవారం జీపీ ఆధ్వర్యంలో పలువురి నివాస ఖాళీ స్థలాలను జేసీబీ ద్వారా చదును చేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. చిరు వ్యాపారం కోసం 1990లో రేకుల షెడ్, గుడిసెలను నిర్మించుకుని చిరు వ్యాపారం (కూరగాయలు, హోటల్, పండ్ల వ్యాపారం) చేసుకుంటు జీవిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యుత్, నల్ల సౌకర్యం తొలగించడం సరికాదని.. ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిఓ 59 ద్వారా ఇందులో పట్టాలను ప్రభుత్వం నుంచి పొంది ఉన్నమని కొందరు పేర్కొన్నారు. మరి కొందరు తమకు పట్టా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు