అంగన్వాడీలో గర్భిణికి ఘనంగా శ్రీమంతం

06-11-2026 | 01:55pm

తలమడుగు, నవంబర్ 6 (విజయక్రాంతి): తలమడుగు-2 అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెలా రెండు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్ రమణ తెలిపారు. ఇందులో భాగంగా నెలకు ఒకసారి శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలతో పాటు సుపోషణ దివస్ (Suposhan Diwas), ఆరోగ్య దివస్ (Health Day) నిర్వహిస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమాల ద్వారా పోషకాహారం (Nutrition Awareness), ఆరోగ్య పరిరక్షణ (Health Awareness)పై అవగాహన పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఆశా కార్యకర్త సృజన పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు