ప్రాక్టీస్‌కే బ్రేక్‌.. రెండో వన్డే డౌటే?

06-11-2026 | 01:55pm

మ్యాచ్‌ వేళ 60 శాతం వర్షం.. అభిమానుల్లో టెన్షన్!

వెల్లింగ్టన్: భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌పై వరుణుడు పంజా విసురుతున్నాడు. తొలి మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం.. రెండో వన్డేకూ ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న ఈ పోరుకు Rain Threat పొంచి ఉందని Weather Forecast చెబుతోంది. దీంతో మ్యాచ్‌ పూర్తిగా జరుగుతుందా? లేక వర్షం కారణంగా ఓవర్లు కుదిస్తారా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

ప్రాక్టీస్ సెషన్లకూ వర్షం బ్రేక్‌

వెల్లింగ్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచే భారీగా వర్షం కురవడంతో ఇరు జట్ల Practice Sessions దెబ్బతిన్నాయి. తొలుత మ్యాచ్‌ జరిగే HNRV స్టేడియంలో కాకుండా బేసిన్‌ రిజర్వ్‌లో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించారు. అయితే వర్షం తీవ్రత తగ్గకపోవడంతో న్యూజిలాండ్‌ జట్టు Indoor Facilityకి వెళ్లింది. భారత జట్టు మాత్రం ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిగా రద్దు చేసుకుంది.

మ్యాచ్‌ సమయంలో వర్షం ముప్పు ఎంతంటే?

AccuWeather అంచనాల ప్రకారం శనివారం వెల్లింగ్టన్‌లో వర్షం పడే అవకాశం 60 శాతంగా ఉంది. ఉదయం కూడా వర్ష సూచన ఉండగా, మధ్యాహ్నం సమయంలో కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు వర్షం పడే ఛాన్స్ 5 శాతం, ఒంటి గంటకు 8 శాతంగా అంచనా వేశారు. అయితే మ్యాచ్‌కు ముందు మధ్యాహ్నం 2 గంటలకు ఈ అవకాశం 49 శాతానికి పెరగనుంది. మ్యాచ్‌ ప్రారంభమయ్యే మధ్యాహ్నం 3 గంటలకు వర్ష సూచన 55 శాతంగా, సాయంత్రం 4 గంటలకు 60 శాతంగా ఉండొచ్చని Weather Report వెల్లడిస్తోంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య వర్షం కొంత తగ్గినా.. రాత్రి 8 గంటల తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉంది. రాత్రి 10 గంటలకు 51 శాతం వర్ష సూచన ఉండటంతో మ్యాచ్‌ కొనసాగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తొలి వన్డేలోనూ వర్షం అంతరాయం

ఆక్లాండ్‌లో బుధవారం జరిగిన మొదటి వన్డే కూడా Rain Interruptions మధ్య సాగింది. తొలుత భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 185 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం 186 పరుగుల Targetతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుపడింది. దీంతో Duckworth-Lewis (DLS) Method ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు. టీమిండియా 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రెండో వన్డేకు కూడా వర్షం ముప్పు ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Weather Conditions ఎలా మారతాయి? మ్యాచ్‌ పూర్తి ఓవర్లతో జరుగుతుందా? లేక DLS Method అమల్లోకి వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు