టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా

06-11-2026 | 01:51pm

పెద్దపల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టీజీపీఎస్సీ పరీక్షలు (TGPSC Examinations) ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల (JNTU Engineering College), పెద్దపల్లిలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల (Mother Teresa Engineering College)లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు, పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రత (Security Arrangements) కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు