పీఎం శ్రీ మోడల్ స్కూల్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్, డీఈఓలకు వినతి

06-11-2026 | 02:56pm

గణపురం, నవంబర్ 66 (విజయక్రాంతి): గణపురం పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని కోరుతూ పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. లలితకు వినతిపత్రాలు సమర్పించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాల సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలోని సమస్యలు పరిష్కారమైతే విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం అందుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు