సాగునీటి కోసం బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
06-11-2026 | 02:42pm
జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండలం కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల పంటలు చేతికందే వరకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ బక్కయ్యకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వరి పొట్ట దశకు చేరుతుందని, ఈ సమయంలో సాగునీరు ఆపడం వలన రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.