ఏజెన్సీలో దాండియా

14-10-2026 | 04:40pm

పల్లెలో జోరుగా దాండియా నృత్యాలు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉత్తర భారతదేశంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆటపాటలతో జరుపుకునే దాండియా నృత్యాలు ఆదిలాబాద్ జిల్లా  ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతానికి తాకాయి. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా  ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ  తదితర మండలాల్లోని గ్రామాలలో దుర్గాదేవి లను ప్రతిష్టించారు. గ్రామాల్లోని మహిళలు ప్రతిరోజు రాత్రి  ఉత్తర భారత దేశంలో  జరుపుకునే దాండియా నృత్యాలను  ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్నారు. ఏజెన్సీలో జరుపుకునే  దాండియా నృత్యాలను తిలకించుటకు  పట్టణ ప్రాంత ప్రజలు గ్రామాలకు చేరుకుంటున్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు  అందుతాండాలోని  మత్తురాల  కులదేవతా దుర్గాదేవి ఆలయంలో  ప్రత్యేక దాండియా నృత్యాలను  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు జరుపుకుంటున్నారు. ఈ గ్రామాలతోపాటు  ఉట్నూర్ మండల కేంద్రంలో సైతం  దాండియా నృత్యాలు జరుపుకుంటున్నారు.

మరిన్ని వార్తలు