మంచరామి లో పత్తి రైతులకు అవగాహన

14-10-2026 | 06:14pm

సుల్తానాబాద్ , అక్టోబర్ 14 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో కోహినూర్ సీడ్ ఫిలిప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Kohinoor Seed Philips India Private Limited) ఆధ్వర్యంలో పత్తి రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్తి సాగు విధానాలు, అధిక దిగుబడులు సాధించే మెళకువలు, పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

సర్పంచ్ ఉప్పు లక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతికి చెందిన పత్తి చేనులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోహినూర్ సీడ్ కంపెనీ తెలంగాణ ప్రతినిధి దేవరబోయిన కిషన్ రైతులకు పత్తి సాగులో పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సూచనలు, సలహాలను వివరించారు. పత్తి రైతులు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంపొందించుకొని, నాణ్యమైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.

మరిన్ని వార్తలు