వైద్య చికిత్స కోసం రూ.పదివేలు వసుధ ఆర్థిక సహాయం

14-10-2026 | 06:11pm

భద్రాచలం, అక్టోబర్ 14, (విజయక్రాంతి): భద్రాచలం కుచెందిన వెంకటరమణ అనే మహిళ వైద్య చికిత్స కోసం వసుధ ఫౌండేషన్(Vasudha Foundation) పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఇటీవల అస్వస్థతకు గురైన వెంకటరమణ వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని ఆమె కుటుంబ సభ్యులు వసుధ ఫౌండేషన్ ను(Vasudha Foundation) ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు రూ 10,000 ఆర్థిక సహాయం అందించాలని వసుధ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు కు సూచించారు. ఈ క్రమంలో భద్రాచలం సీఐ పట్ల రాజు చేతుల మీదుగా వెంకటరమణ భర్త సోమయ్యకు రూ పదివేలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు