పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి జిల్లా విద్యాధికారి
బోథ్,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఇప్పటినుండే సన్నద్ధం కావాలని మంచి ఫలితాలు సాధించి త్రిబుల్ ఐటీ(Triple IT)లో సీట్ల సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి(District Education Officer Madhavi) పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను పలు విషయాలపై అడగడం జరిగింది.
విద్య బోధన సాగుతున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే బాసరలో నీ ఐఐటీలో సీటు సాధించవచ్చని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల కనుగుట్ట ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఆమె వెంట మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్ ఉన్నారు.