క్యాన్సర్ ను జయిద్దాం.. జీవితాలను కాపాడుదాం
07-11-2026 | 09:52pm
సీహెచ్ఓ బిచ్చునాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీ(Arvapally PHC)లో శనివారం క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు గుర్తింపే ప్రాణ రక్షణ అని, క్యాన్సర్ కారణాలు(Causes of cancer), లక్షణాలు, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు సీహెచ్ఓ బిచ్చునాయక్ తెలిపారు. మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మాధవి, లావణ్య, మహేష్, అనూష, శైలజ పాల్గొన్నారు.