దుద్దెడ టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు తప్పని తిప్పలు

07-11-2026 | 09:49pm

కొండపాక,(విజయక్రాంతి): దీపావళి(Deepavali) పండుగ సందర్భంగా శనివారం  పట్టణాల నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వాహనాలతో దుద్దెడ రాజీవ్ రహదారిపై టోల్ ప్లాజా(Duddeda Toll Plaza) వద్ద రద్దీ నెలకొంది. ప్రతి పండుగ సమయంలో టోల్ గేట్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళల్లో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు టోల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ టోల్ ప్లాజా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు