ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలింపు

04-11-2026 | 11:22pm

ములకలపల్లి, నవంబర్ 4 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం తాళ్ల పాయి గ్రామంలో ఉన్న నసరత్ కుంట చెరువు వరద ఉధృతంగా ప్రవహించడంతో తాళ్ల పాయి గ్రామం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తిగా ముంపుకు గురయ్యాయి.

జిల్లా పోలీస్ అధికారి రోహిత్ రాజు(SP Rohit Raju) ముంపు గ్రామాన్ని సందర్శించి, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందంతో ముంపుకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతమైన రింగిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలకు తరలించి, పునరావాసం కల్పించారు. వీరికి పంచాయితీ , రెవెన్యూ అధికారులు భోజనం, వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గడ్డం సుజాత, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిఎస్పి సతీష్, సిఐ సతీష్,ఎస్.ఐ.మధు ప్రసాద్,ఆర్ ఐ రాంబాబు,ఎం పి ఓ రమేష్ కుమార్,పంచాయతీ కార్యదర్శి మాధురి, జిపిఓ నానుబాబు, గ్రామపంచాయతీ సిబ్బంది అశోక్,రమేష్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు