పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు

04-11-2026 | 11:05pm

నాగల్‌గిద్ద, నవంబర్ 4 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల పరిధిలో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రామకృష్ణ(SI Ramakrishna) హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పేకాట స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు