తండ్రికి తలకొరివి పట్టిన కూతురు

04-11-2026 | 11:17pm

చేగుంట నవంబర్ 04,(విజయక్రాంతి): చేగుంట మండల(Chegunta Mandal) కేంద్రానికి చెందిన నరసింహచారి (48) వృత్తి రీత్యా ఆర్ఎంపీ డాక్టర్. అతను బ్రతుకుతెరువు కోసం హైదరాబాదు మలక్పేట లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ రోజు చేగుంట నుండి హైదరాబాద్ కు తన స్వంత వాహనం పై హైదరాబాద్ కు వెళ్లివచ్చేవాడు.

నిన్న ఉద్యోగ రీత్యా ఇంటి నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరగా తూప్రాన్ నాగులపల్లి బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ అతివేగంగా,అజాగ్రత్తగా వెనకనుండి ఢీకొట్టగా తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. నరసింహాచారికి ఇద్దరు కూతుర్లు రక్షిత,,అక్షర, .నరసింహచారి  అంత్యక్రియలు బుధవారం చేగుంటలో నిర్వహించగా పెద్ద కూతురు రక్షిత తండ్రికి తలకొరివి పట్టింది.

ఈ దృశ్యం చూసిన  ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు.నరసింహాచారికి ఒక్క రూమ్ ఉన్న చిన్న ఇల్లు మాత్రమే ఉండి వృద్ధ వికారంగురాలైన నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమె పనులు ఆమె చేసుకోరాని తల్లి (75) లక్ష్మీ ఉంది. ఇప్పటి వరకు మొత్తం కుటుంబం నరసింహచారి పైన ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఇంటికి  ఆధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ కుటుంబం అగమ్య గోచరంగా తయారైంది. ఈ విషయం లో తెలంగాణ ప్రభుత్వం  ఆదుకోని పిల్లల చదువులకు,పెళ్లిళ్లకు అండగా నిలబడాలని బందు,మిత్రులు,అంత్యక్రియలకు వచ్చిన వారు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు