ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల పరిశీలన
20-11-2026 | 04:02pm
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని ఇందిరమ్మ జీవిత బీమా పథకం కింద లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మండలంలోని గ్రామపంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని మరల పెళ్లి గ్రామంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీడీవో ఎల్. రమేష్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.