ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు భరోసా

20-11-2026 | 03:34pm

సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

ప్యాక్స్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు

నల్లబెల్లి,(విజయక్రాంతి): దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకే ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని నల్లబెల్లి మండల ప్యాక్స్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా రఘుపతిరావు మాట్లాడుతూ. ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు రవాణా భారం తప్పుతుందని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పు కృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, ప్యాక్స్ సీఈఓ మొగిలి, డైరెక్టర్లు చార్ల శివారెడ్డి, వైనాల అశోక్, మామిండ్ల రాజిరెడ్డి, త్రికోవెల మురళి, బత్తిని మల్లయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఇస్తారి శేఖర్, ఉప సర్పంచ్ బోళ్ల సర్వేశం, గ్రామ కమిటీ అధ్యక్షుడు మోత్కూరి కుమారస్వామి, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు