నూతన కరీంనగర్ డెయిరీ పార్లర్ ప్రారంభం

20-11-2026 | 03:46pm

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్ లో కెమిస్ట్రీ భవన్(Chemistry Bhavan) ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ డెయిరీ పార్లర్‌(Karimnagar Dairy Parlour) ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై... కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర రావు, స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావులతో కలిసి డెయిరి పార్లర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... వినియోగదారుల నమ్మకానికి మారుపేరుగా నిలిచిన కరీంనగర్ డెయిరీ, స్వచ్ఛమైన మరియు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందించడంలో ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ యాజమాన్యం , నిర్వాహకులు పంజాల అనిల్, ఉషయ్య మరియు స్థానిక ప్రముఖులు  పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు