బాలల హక్కులపై అవగాహన

20-11-2026 | 03:33pm

నెహ్రూ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ప్రపంచ బాలల దినోత్సవాన్ని(World Children's Day celebrations) పురస్కరించుకుని నెహ్రూ నగర్ అంగన్వాడీ కేంద్రం()Nehru Nagar Anganwadi Centerలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం మార్గదర్శిని పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. పిల్లలకు పరిశుభ్రత, పౌష్టికాహారం, విద్య ప్రాముఖ్యత, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాలికల హక్కులు, భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లెందులపాడు సెక్టార్ సూపర్వైజర్ ధనలక్ష్మి మాట్లాడుతూ బాలల సమగ్ర అభివృద్ధికి విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలికలకు విద్యావకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సక్కుబాయి, సుశీల, తల్లులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు