సమాజానికి మీడియా ఎంతో అవసరం

20-11-2026 | 03:56pm

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే మీడియా సమాజానికి ఉపయోగపడే వార్తా కథనాలు రాయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) సూచించారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ జర్నలిస్ట్ డే(National Journalist Day) వేడుకలను పురస్కరించుకొని సీనియర్ రిపోర్టర్లకు సన్మానం చేశారు. ప్రింట్ ఎలక్ట్రాన్ మీడియా లో 20 ఏళ్లు పనిచేసిన సీనియర్ పాత్రికేయులు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు.

ప్రభుత్వం ఏ పథకం అమలు చేసిన మీడియా పాత్ర లేనిది అది ప్రజలకు చేరలేదని గుర్తు చేశారు. అన్ని పత్రికల వార్తలు చదివి ఏవైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామటూ తెలిపారు. జిల్లాలో కొన్ని పత్రికలు గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను వెలికి తీయడం వల్ల వాటిని పరిష్కరించే అవకాశం జిల్లా యంత్రాంగానికి దక్కుతుందని గుర్తు చేశారు. సోషల్ మీడియా ఏఐ మీడియా వచ్చిన నేపథ్యంలో పాత్రికేయులు వార్తలను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.

వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని ఇప్పటికీ అనేక పత్రికల వార్తలను ఆధారంగా తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ఇది మీడియా వాళ్లని సాధ్యం అయిందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్ కు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతి పత్రం అందించగా ప్రభుత్వ ఆదేశించిన వెంటనే ఇండస్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ విష్ణువర్ధన్ సిపిఓ గంగారెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్  పాల్గొన్నారు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు