ఇందిరమ్మ కుటుంబ భీమా, పెన్షన్ పథకాలపై సంబరాలు

20-11-2026 | 03:50pm

బేల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం(Rs 5 lakh Indiramma Family Insurance,)తో పాటు ఒంటరి మహిళల పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలుపుతూ ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) బేల మండలం చప్రాల గ్రామంలో గ్రామ ప్రజలు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,డౌలత్ పటేల్ ఉప సర్పంచ్, సాగర్ వార్డు సభ్యులు, మార్కెట్ వైస్ చైర్మన్ సవాపురే విలాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ భీమా, ఒంటరి మహిళల పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ పథకాల ప్రారంభానికి కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు