భక్తిశ్రద్ధలతో హనుమత్ దీక్ష రెండో సంకల్ప పాదయాత్ర
స్వామివారి రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు
మఠంపల్లి,(విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి హనుమత్ దీక్ష(Sri Sri Sri Pabbati Anjaneya Swamy Hanumath Deeksha)లో భాగంగా నిర్వహించనున్న రెండో సంకల్ప పాదయాత్ర, స్వామివారి రథోత్సవానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. బానోతు వెంకటేశ్వర్లు గురుస్వామి, బానోతు రాజేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 5:15 గంటలకు మఠంపల్లి మండలంలోని కొత్త తండా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం(Sri Abhayanjaneya Swamy Temple) నుంచి హనుమంతులగూడెంలోని శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు రెండో సంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం స్వామివారి రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
పాదయాత్రలో పాల్గొనే స్వాములకు,భక్తులకు మార్గమధ్యంలో వివిధ గ్రామాల వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.పాత దొనబండ తండాలో ఉదయం పాలు,పండ్లు, భీల్యానాయక్ తండాలో అల్పాహారం, కామచికుంట తండాలో మహా అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్పంచులు బానోతు అరుణా దేశ్ పాండు నాయక్,మాలోతు సక్రు నాయక్,మాజీ ఎంపీటీసీలు లక్ష్మి భరత్ నాయక్,బాల నాయక్, దేవాలయం చైర్మన్ నాగరాజు,స్వాములు పాల్గొన్నారు.హనుమన్ దీక్ష స్వాములు, అయ్యప్ప స్వాములు, శివయ్య స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.