క్వాంటం టెక్నాలజీపై గీతంలో ఆరు రోజుల అధ్యాపక శిక్షణ
20-11-2026 | 03:29pm
పటాన్ చెరు: క్వాంటం టెక్నాలజీ(Quantum technology)పై అధ్యాపకుల సైద్ధాంతిక, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించేందుకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(Geetam Deemed University) ఈ నెల 23 నుంచి 28 వరకు ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, జాతీయ క్వాంటం మిషన్ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో క్వాంటం కంప్యూటింగ్, అల్గారిథమ్స్, క్రిప్టోగ్రఫీ, క్వాంటం కమ్యూనికేషన్, ఎర్రర్ కరెక్షన్, క్విస్కిట్ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, పరిశోధకులు పాల్గొని ఉపన్యాసాలు, ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించనున్నారు.