నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవం
అధ్యక్షుడిగా వైనాల వీరస్వామి ఎన్నిక
నల్లబెల్లి,(విజయక్రాంతి): నల్లబెల్లి గ్రామ నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీని శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్, ప్యాక్స్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.గ్రామ అధ్యక్షుడిగా వైనాల వీరస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పరికి త్యాగరాజు, ఉపాధ్యక్షులుగా గాజు బిక్షపతి, కొత్తపెళ్లి రమణాచారి, ప్రధాన కార్యదర్శిగా పాండవుల శంకర్ లింగం, కార్యదర్శులుగా గాజుల రాజేందర్, కోయిల వీరన్న, ప్రచార కార్యదర్శిగా బత్తిని హరీష్, కోశాధికారిగా రెడ్డి రంజిత్, సలహాదారుడిగా వేముల రాజు ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా కనకం సాగర్, గాదెగొని రమేష్, సామల సారంగం, ఎండీ అంజద్, త్రికోవెల రామ్మోహన్, ఉడుత ప్రభాకర్, నానబోయిన ఎల్లయ్య, యాదగిరి నరేష్, ముటికే శ్రీను, నాగిల్లి బాబులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్లు చార్ల శివారెడ్డి, బత్తిని మల్లయ్య, మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం, మాజీ ఎంపీటీసీ జన్ను జయరావ్, ప్రతాప్ సింగ్, గ్రామ యూత్ అధ్యక్షుడు మర్రి రాజు, నాయకులు మాసంపల్లి అఖిల్, సామల దేవేందర్, చింతకింది శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.