ఆదివాసీ సంస్కృతి – కేసీఆర్ గుర్తింపు

06-11-2026 | 07:20pm

గుస్సాడీ కళాకారులతో కలిసి నృత్యం చేసిన మాజీ మంత్రి జోగు రామన్న

బేల, నవంబర్ 06(విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు(Aboriginal culture and traditions) కేసీఆర్‌ ప్రభుత్వం(KCR's government) ప్రత్యేక గుర్తింపు కల్పించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. శుక్రవారం బేల మండలంలోని బాది గ్రామంలో నిర్వహించిన గుస్సాడీ దండారి ఉత్సవాల్లో(Gussadi Dandari Utsava) ఆయన పాల్గొని కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జోడేఘాట్‌లో కొమురం భీమ్‌కు అధికారిక నివాళులు, రూ.25 కోట్లతో మ్యూజియం నిర్మాణం, ఆదివాసీలకు భూమి పట్టాలు, రైతుబంధు(Land title deeds, Rythu Bandhu) వంటి పథకాలతో కేసీఆర్‌ ప్రభుత్వం వారి అభివృద్ధికి కృషి చేసిందన్నారు.

రైతులను ఆదుకోవడంలో విఫలం

ఎలినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆదుకోవడం లేదని విమర్శించారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్‌, సతీష్‌ పవర్‌,  విపిన్‌ కోడె, మస్కే తేజరావు, అఖిల్ , గెడం మాదవ్‌, దీపక్ గౌడ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్ లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు