రాజన్నపేట శివారులో ముమ్మరంగా రీ సర్వే

13-11-2026 | 02:57pm

కన్నాయిగూడెం, నవంబర్ 13(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రీ సర్వే పనులను(Re-survey work) వేగవంతం చేయాలని మండల తహశీల్దార్  యం. డి సర్వర్(Tehsildar M. D. Sarwar) అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట శివారులో సర్వే జరుగుతున్న ప్రదేశాన్ని శుక్రవారం రోజున ఆకస్మిక తనిఖీ చేశారు. భూమి ఖచ్చిత హద్దులను సర్వేయర్లకు చూపించాలన్నారు. రీసర్వేపై  రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సర్వర్ పాషా, డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ కుమార్, ఆర్ ఐ త్రివేణి బాబు, జిపిఓ బలరాం, సర్వేయర్లు ఆనంద్,బుచ్చిబాబు, రైతులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు