సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

13-11-2026 | 03:04pm

జగిత్యాల నవంబర్ 13 ( విజయ క్రాంతి ): జగిత్యాల రూరల్ మండలం హైదర్ పల్లి గ్రామంలో(Haidarpalli Village) నిర్వహించిన సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Dr. Sanjay Kumar) హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ కూతురు రాజేష్, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు