ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): జగిత్యాల రూరల్ మండలం వంజరుపల్లి గ్రామంలోని(Vanjarupalli Village) ఎల్లమ్మ దేవాలయంలో(Yellamma Temple) నిర్వహించిన ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Dr. Sanjay Kumar) హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం మల్లన్న స్వామి ఆలయం లో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఫ్యాక్స్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, గౌడ కులస్తులు, సర్పంచ్ గంగ మల్లయ్య, వంశీ, మాజీ ఎంపీటీసీ కుడకల లక్ష్మణ్, మాజీ ఉప సర్పంచ్ హరీష్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీకాంత్, నాయకులు రవి, మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.