పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

13-11-2026 | 02:51pm

కన్నాయిగూడెం, నవంబర్ 13(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం, ముప్పనపల్లి గ్రామాల్లో(Muppanapalli Village) సాగు చేస్తున్న మిరప పంటలను(Chilli crop) శుక్రవారం రోజున మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మిరప తోటల్లో మొక్కల పెరుగుదల, పూత, కాయల దశ, తెగుళ్లు మరియు పురుగుల ఉధృతిని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిరప పంటకు సోకే తెగుళ్లు, పురుగుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వేరు కుళ్లు, కొమ్మ కుళ్లు, ఆకుముడత, నల్ల తామర పురుగు వంటి సమస్యలను ఎప్పటికప్పుడు గమనించాలని, సమస్య గుర్తించిన వెంటనే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. వేరు కుళ్ళు గమనించినట్లయితే ప్లాంటోమైసిన్ 2 గ్రామాలు లేదా ట్రైకోడెర్మా కలిపి మొదల్ల వద్ద పోసుకోవాలి అని అన్నారు .

కొమ్మ కుళ్ళు సమస్యకు మేటిరామ్ 400 గ్రామాలు ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఆకు పై ముడత సమస్య గమనించినట్లయితే డయాఫెంతురియన్ 2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 గ్రామాలు వంటి పురుగు మందులను పిచికారి చేసుకోవాలి అని తెలిపినారు.

రైతులు అనవసరంగా పురుగుమందులు పిచికారీ చేయకుండా, పంట పరిస్థితిని బట్టి సిఫారసు చేసిన మందులను మాత్రమే సరైన మోతాదులో వినియోగించాలని సూచించారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని తమ పంట సమస్యలను వ్యవసాయ అధికారికి వివరించారు. ఏదేని పంటలో వచ్చే సమస్యల నివారణ కొరకు ఫోన్ ద్వారా 8977751150 నెంబర్ లో వ్యవసాయ అధికారి సంప్రదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తొంగళి సుమన్,తిప్పనపల్లి విజయ్, కుమ్మరి కుమార్, నరెడ్ల వెంకటయ్య మరియు తదితరులు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు