క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన కళాశాల విద్యార్థులు

13-11-2026 | 02:53pm

పాపన్నపేట,నవంబర్13: పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు(Students of the Government Junior College) క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణలో భాగంగా సాఫ్ట్‌బాల్ విభాగంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దేవసూత్ నరేష్, వాలీబాల్ విభాగంలో బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జి.యువరాజ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్   అండ్ స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ సంతోష్ కుమార్, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇదే ఉత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు