కేటీఆర్ సభపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
బోథ్,(విజయక్రాంతి): ఈనెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీBRS Party) రాష్ట్ర నాయకులు కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో నిర్వహించే సభను నియోజకవర్గంలోని నాయకులంతా విజయవంతం చేసే విధంగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadav Anil) ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు నాయకులు తరలివచ్చే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.
బిజెపి అడ్డాలో సత్తా చాట్ ఎందుకు కృషి
నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుండి బిజెపి(BJP) ఎమ్మెల్యే ఉండడం తో పాటు, కాంగ్రెస్ పార్టీ బలం ఉన్న ఈ నియోజకవర్గంలో బి ఆర్ స్ పార్టీ తమ సత్తాను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సభ విజయవంతం కావడంతో నిర్మల్లో సహితం తమ ప్రాబల్యాన్ని చూపించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. సమావేశాన్ని ఎమ్మెల్యే బుజస్కందాలపై వేసుకొని సభ జరగనుండడంతో తనదైన ముద్ర వేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
ముందు చూపుతో ఎత్తుగడ
నిర్మల్ ఎమ్మెల్యే గాబీజేపీ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అక్కడ వి ఆర్ యస్ పార్టీ సత్తా ఏమిటో చూపించాలన్న ఆలోచనతో బిఆర్ఎస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. నిర్మల్ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొంది గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోచేరిన తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తుండడం వల్ల ఇరుపార్టీల నాయకత్వానికి సవాల్ విసిరే విధంగా సభను నిర్వహించానున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే ఒంటి చేత్తో కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.