మినీ స్టేడియం ఏర్పడడం స్థల పరిశీలన
బోథ్. అక్టోబర్ 30 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) మైదానంలో మినీ స్టేడియం(Mini Stadium) ఏర్పాటు కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగానే శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ(Sports Authority) అధికారితో పాటు ట్రైన్ కలెక్టర్ ముకుంద రెడ్డి గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ తో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
పాత జూనియర్ కళాశాల స్థలంలో మినీ స్టేడియం ఏర్పాటు కోసం స్థలం ఎంపిక చేయడం జరిగింది. పాత కళాశాల గదులను కూల్చివేసి ఆ స్థలం తో పాటు కొంత రెవెన్యూ కార్యాలయం స్థలాన్ని కలుపుకొని మినీ స్టేడియం ఏర్పాటు చేయవచ్చని అధికారులు నిర్ధారణకు వచ్చారు. గ్రామస్తులు స్థలాన్ని తొందరగా అప్పగిస్తే పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పి విజయలక్ష్మి తో పాటు ఆర్ఐ నాగవరావ్, సర్వేయర్ నాగరావ్ జిపిఓ సుమలత వార్డు సభ్యులు షేక్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు.