నాగోబా సన్నిధిలో గెస్ట్ హౌస్ నిర్మాణం పనులు ప్రారంభం..

04-11-2026 | 05:07pm

రూపాయలు కోటితో  వసతి గృహం నిర్మాణం పనులు..

ఉట్నూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబా ఆలయ(Nagoba Temple) ప్రాంగణంలో విఐపిల కోసం కోటి రూపాయలతో నిర్మించే వసతిగృహం(గెస్ట్ హౌస్) పనులను బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి అధికార పర్యటనలో నాగోబాను దర్శించుకున్నారు. అదే రోజు  నాగోబా ఆలయ అభివృద్ధికి  నిధులు కేటాయిస్తానని  హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డిగా ఇచ్చిన హామీ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్శిషా పూర్తి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లా కలెక్టర్ నుంచి వెళ్లిన నివేదికల ఆధారంగా నాగోబా సన్నిధిలో అవసరమైన పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంజూరైన నిధులతో నాగోబా దర్శనానికి వచ్చే ఉన్నత అధికారులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వీఐపీల కోసం కోటితో గెస్ట్ హౌస్ నిర్మించాలని నిర్ణయించారు. గెస్ట్ హౌస్ నిర్మాణం పనులను వచ్చే జాతరలోగా  పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం  డిప్యూటీ ఈ ఈ నవీన్, ఏఈఈ ఉజ్వలు తెలిపారు.

మరిన్ని వార్తలు