పేదవాడి కళ సాకారం అవుతుంది...
తాడ్వాయి,నవంబర్,04(విజయ క్రాంతి): గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి(Indiramma House) నిర్మాణాలతో పేదవాడి కళ సహకారం అవుతుందని కాంగ్రెస్ పార్టీ(Congress Party) మండల అధ్యక్షులు బండారు సంజీవులు తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ గృహ లబ్ధిదారురాలైన ఏరుపుల మంజుల ఇంటికి నిర్వహించిన గృహప్రవేశంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదివరలో ఎంతోమంది పేదలు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అలాంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఆవాసం ఏర్పాటు చేయడంతో వారి సంతోషానికి అవధులు లేవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య,తాడువాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజీగారి సుధాకర్ రావు,నందివాడ గ్రామ కమిటీ అధ్యక్షులు బాల సాయిలు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, గ్రామ వీడిసి అధ్యక్షులు కంకణాల బాల్ చంద్రం,నాయకులు శ్రీకాంత్,నారాయణ, పండరి తదితరులు పాల్గొన్నారు.