వేంసూరు మండల రైతాంగానికి సాగునీటి వరం..
ఎన్టీఆర్ కాలువ ద్వారా నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే..
సత్తుపల్లి నవంబర్ 4 (విజయక్రాంతి): రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా బేతుపల్లి పెద్ద చెరువు నుంచి వేంసూరు మండలానికి నీటి విడుదల కాలువ నీటికి పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు సత్తుపల్లి నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించే దిశగా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కాలువ ద్వారా వేంసూరు మండలానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr Matta Ragamayee Dayanand) నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేంసూరు వద్ద ఎన్టీఆర్ కాలువలో ప్రవహిస్తున్న జలాలకు పసుపు, కుంకుమ జల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో నీటి విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సాగునీరు రైతాంగానికి ఎంతో కీలకమని, సమయానికి నీరు అందితే పంటలు సమృద్ధిగా పండడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమ్సూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.