పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమై లక్ష్యాన్ని సాధించాలి

04-11-2026 | 05:17pm
  1. YTC ఉట్నూర్‌లో PC & SI ప్రిలిమినరీ పరీక్షల అభ్యర్థులతో కలెక్టర్, ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ ముఖాముఖి...
  2. జిల్లా కలెక్టర్ రాజర్శి షా..

ఉట్నూర్, నవంబర్ 04( విజయక్రాంతి ): ప్రణాళిక బద్ధంగా చదవడంతోపాటు  ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్పెక్టర్ల  సూచనలు సలహాలు(Suggestions and advice from inspectors) పాటిస్తే పోటీ పరీక్షలలో  సునాయాసంగా  లెక్కగలుగుతామని  జిల్లా కలెక్టర్ రాజర్శి షా(District Collector Rajarshi Shah) అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు, ఉట్నూర్ సబ్ కలెక్టర్  ప్రణయ్  ఉట్నూర్‌లోని యూత్ ట్రైనింగ్ సెంటర్  వై టీ సీ (YTC)ను సందర్శించి, అక్కడ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోటీ పరీక్షల పరీక్షా విధానం, ప్రశ్నపత్రం సరళి, సిలబస్, మార్కుల విభజన తదితర అంశాలను వివరించారు. పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా ఎలా సిద్ధం కావాలి, సమయపాలన పాటిస్తూ రోజువారీ చదువును ఎలా కొనసాగించాలి, గత ప్రశ్నపత్రాలను ఎలా సాధన చేయాలి అనే అంశాలపై విలువైన సూచనలు చేశారు.

అభ్యర్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించాలని, అందుబాటులో ఉన్న శిక్షణా వనరులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కలెక్టర్, ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా నోట్‌బుక్స్ మరియు పెన్నులను పంపిణీ చేశారు. అభ్యర్థులు వాటిని సద్వినియోగం చేసుకొని చదువులో మరింత శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్   నాగభూషణం, వై టీ సీ సిబ్బంది, రీజనింగ్ ఫ్యాకల్టీ  కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు